సునీల్ నరైన్ సంగతి తెలిసిందేగా. కోల్ కతా నైట్ రైడర్స్ కి కీలకమైన ఆటగాడు. అటు బౌలింగ్ తో ఇటు పించ్ హిట్టింగ్ బ్యాటింగ్ తో కేకేఆర్ కు 13 కొన్నేళ్లుగా కొండంత అండగా నిలుస్తున్నాడు. కేకేఆర్ మూడు సార్లు ఛాంపియన్ గా నిలవటంతో నరైన్ పాత్ర చాలా ప్రత్యేకం. అలాంటి నరైన్ బ్యాటింగ్ ఆడేప్పుడు రూల్స్ ను అతిక్రమించి ఆడుతున్నాడా. రీసెంట్ గా ఐపీఎల్ లో ఓ రూల్ తీసుకువచ్చారు. ప్రధానంగా ఆయా టీమ్స్ లో హిట్టర్లుగా పేరు తెచ్చుకున్న ఆటగాళ్లను క్షుణ్నంగా అబ్జర్వ్ చేస్తున్నారు అంపైర్లు. అందులో భాగంగానే ఆటకు దిగే ముందే వాళ్లు వాడుతున్న బ్యాట్స్ సైజ్ ను చెక్ చేసుకున్నారు. నిన్న పంజాబ్ తో కేకేఆర్ కు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ముందు బ్యాటింగ్ చేసి 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బౌలింగ్ లో రెండు వికెట్లు తీసిన నరైన్..బ్యాటింగ్ 112 పరుగులు చేజ్ చేసేందుకు ఓపెనర్ గా వచ్చాడు. అయితే ఇంకా గ్రౌండ్ లోకి ఎంటర్ అవ్వకముందే మ్యాచ్ అఫీషియల్స్ వచ్చి నరైన్ బ్యాట్ ను ఇదిగో ఇలా సైజ్ చెక్ చేశారు. నరైన్ తో పాటు రఘవంశీ బ్యాట్ కూడా చెక్ చేశారు. రఘవంశీ బ్యాట్ నిబంధనలకు అనుగుణంగానే ఉంది. కానీ నరైన్ బ్యాట్ మాత్రం చాలా లావుగా ఉండటాన్ని గుర్తించిన మ్యాచ్ అఫీషియల్స్ అతని బ్యాట్ ను రిజెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నరైన్ కాసేపు అధికారులతో వాగ్వాదానికి దిగాడు. చివరికి వేరే బ్యాట్ తీసుకుని దానితో ఆడటానికి వెళ్లాడు. ఆచిరాకు అతనిలో ఉందేమో మార్కో జాన్సన్ బౌలింగ్ లో ఐదు పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అక్కడ మొదలైన కేకేఆర్ పతనం 95 పరుగులకే అలౌట్ అయ్యి సంచలన రీతిలో ఓటమిని మూటకట్టుకునే వరకూ ఆగలేదు. వాస్తవానికి నిబంధనల ప్రకారం క్రికెటర్ ఆడే బ్యాట్ up to 2.64 inches ఉండాలి లేదంటే 6.7 centimeters deep గా అయినా ఉండాలి. నరైన్ బ్యాట్ అంత కంటే బండగా ఉండటంతో అతని బ్యాట్ ను రిజెక్ట్ చేశారు. బ్యాట్ లావుగా ఉంటే దాన్ని క్యారీ చేయటం కష్టమైనా కానీ బాల్ ను కనెక్ట్ చేసినప్పుడు మూమెంటమ్ ఎక్కువ లభించి బాల్ మ్యాగ్జిమం డిస్టెన్స్ ను కవర్ చేస్తుంది. అందుకే కొన్ని నిబంధనలు అందరూ ఒకే తరహా బ్యాట్స్ వాడాలనే నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నారు.